సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.60వేలు?

170చూసినవారు
సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.60వేలు?
AP: మార్కాపురం జిల్లా, అయ్యలూరివారిపల్లిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు భారీగా నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో, ఒక పార్టీ అభ్యర్థి రూ.25 వేలు, మరో పార్టీ అభ్యర్థి రూ.15 వేలు, రెబల్ అభ్యర్థి రూ.20 వేల చొప్పున ఓటుకు డబ్బులు పంచినట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రయాణ ఖర్చుల పేరుతో అదనంగా ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 841 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్