AP: పల్నాడు జిల్లా, వెల్లటూరు గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి చొరబడిన
టీడీపీ చెందిన వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, రిగ్గింగ్‌కు ప్రయత్నించిన సదరు వ్యక్తులను అక్కడి నుండి తరిమికొట్టారు. పోలీసుల నిమ్మకు నీరెత్తిన వైఖరిపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.