సర్పంచ్ ఎన్నికలు.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత

12చూసినవారు
AP: పల్నాడు జిల్లా, గామాలపాడులో సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో మద్దతు కోరుతూ జంగా వర్గీయులు తమపై దాడి చేశారని ఎస్సీ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బాధితులు జంగా కృష్ణమూర్తి కుమారులు, వారి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్