AP: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ
ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న తొలి విడత ఎన్నికల
నోటిఫికేషన్, 26న తొలి విడత పోలింగ్,
ఫలితాలు వెలువడనున్నాయి. 16న రెండో విడత ఎన్నికల
నోటిఫికేషన్. 29న రెండో విడత పోలింగ్,
ఫలితాలు, 19న మూడో విడత ఎన్నికల
నోటిఫికేషన్, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్,
ఫలితాలు వెలువడనున్నాయి. 3 విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు
ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోననే ఆసక్తి నెలకొంది.