AP:
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం రంగాపురంలో
టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అక్కడ ఓటుకు రూ.2 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.