AP: మార్కాపురం జిల్లాలోని చిన్నఓబినేనిపల్లిలో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.23 లక్షల ధరకు కొండారెడ్డి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని, మరెవరూ నామినేషన్ దాఖలు చేయకూడదని గ్రామస్థులు తీర్మానించినట్లు సమాచారం. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఇలా వేలం పాట ద్వారా నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.