
ప్రమాదవశాత్తు వాగులో పడి అన్నాచెల్లెలు మృతి
TG: ప్రమాదవశాత్తు వాగులో పడి అన్నాచెల్లెలు మృతి చెందిన ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో చోటు చేసుకుంది. వాగులో పడిన చెల్లె లయను కాపాడబోయి అన్న గణేశ్ నీటిలో మునిగిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




