స్కూల్ బ‌స్సు బోల్తా.. 25 మంది విద్యార్థులు సేఫ్ (వీడియో)

3చూసినవారు
AP: అనంతపురం జిల్లాలో గురువారం స్కూల్‌ బస్సు బోల్తాపడింది. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం వద్ద అనంతలక్ష్మి పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. నార్పల నుంచి అనంతపురం వస్తుండగా బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్