AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదని పేర్కొంది. మిగిలిన అన్ని పత్రాలు సమర్పిస్తే చాలని వెల్లడించింది. NOCల కోసం నామినేషన్లు ఆపొద్దని ఆదేశాలు జారీ చేసింది. NOC ఉండాలనే నియమం లోకల్ బాడీ ఎన్నికల చట్టంలో లేదని పేర్కొంది.