AP: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నియామకంపై వైఎస్
జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు నిజాయితీగా
ఎన్నికలు జరిపే ధైర్యం లేదని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను ఎన్నికల కమిషన్ విధుల నుంచి తొలగించిందని, ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని
జగన్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఎస్ఈసీగా నియమించడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.