ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఉపసంహరించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అమల్లో ఉన్న నియమావళిని తొలగిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న ప్రాంతాల్లో సాధారణ పరిపాలనా కార్యకలాపాలు తిరిగి కొనసాగనున్నాయి.