ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఏకగ్రీవమైన స్థానాలు కాకుండా, మిగిలిన 3,803 స్థానాలకు 10,292 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 29,608 వార్డులకు
ఎన్నికలు జరగనుండగా, 83 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పారదర్శకత కోసం అధికారులు 50,476 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసి, 9,300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.