పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం (వీడియో)

43చూసినవారు
AP: మన్యం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఎస్పీ ఇటీవల మెటర్నిటీ లీవ్ మంజూరు చేశారు. సెలవుపై వెళ్తున్న ఆమెకు సీఐ బి.వెంకట్రావు ఆధ్వర్యంలో తోటి సిబ్బంది స్టేషన్ ఆవరణలోనే సీమంతం నిర్వహించారు. పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు పెట్టి, అక్షతలు వేసి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్