AP: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రాజకీయ సమీకరణాలు మారాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంత మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వైసీపీ నాయకులు ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులతో పాటు సుమారు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని ఈ సందర్భంగా సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.