AP: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేట కోసం వెళ్ళి గల్లంతయ్యారు. వీరు ఈనెల 11న వేటకు బయలుదేరగా, 14వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన నెలకొంది. గత పది రోజులుగా వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులను ఆశ్రయించి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.