పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, రేపు 16 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇచ్చింది. మత్స్యకారులను నేడు, రేపు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.