బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌

2చూసినవారు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గంటకు 8 కి.మీ వేగంతో పయనిస్తున్న ఈ తుఫాన్, నరసాపురానికి 540 కి.మీ, చెన్నైకి 570 కి.మీ మరియు పూరికి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ 20వ తేదీన నరసాపురం-పూరి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు సుమారు 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్