కాసేపట్లో తీవ్ర తుఫాన్: APSDMA

24చూసినవారు
కాసేపట్లో తీవ్ర తుఫాన్: APSDMA
AP: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు కదులుతోందని, కాసేపట్లో తీవ్ర తుఫాన్‌గా బలపడనుందని పేర్కొంది. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 540 కి.మీ, కాకినాడకు 620 కి.మీ, మచిలీపట్నంకు 720 కి.మీ, బాపట్లకు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయంది.

సంబంధిత పోస్ట్