ఏపీలో తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐదు రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీలు సహా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని సూచించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.