తీరాన్ని దాటిన తీవ్ర తుఫాన్.. భారీ వర్ష సూచన

29చూసినవారు
AP: యానాంకు నైరుతి దిశలో, నరసాపురం సమీపంలో అత్యంత తీవ్ర తుఫాన్ తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఈ ప్రక్రియ జరగగా, ప్రస్తుతం అది తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల, గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, తూ.గో, ప.గో, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్