AP:
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా మురుగునీరు చేరడం వల్ల, ప్రయాణికులు అడుగు పెట్టడమే కష్టంగా మారి, దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవడానికి కూడా వీలులేని విధంగా తయారైన ఈ దుస్థితి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.