పెద్దిరెడ్డికి షాక్.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

5చూసినవారు
పెద్దిరెడ్డికి షాక్.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
AP: చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ షాక్ తగిలింది. పుంగనూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో పలమనేరు శాసనసభ్యులు శ్రీ నూతనకాల్వ అమరనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెక్కుంది పంచాయతీ పరిధిలోని పెద్ద అల్సాపురం, చిన్న అల్సాపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్థులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్