AP: అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం నూలువీడు గ్రామంలో మంగళవారం వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న నూలివీడు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 100 కుటుంబాలకు పైగా వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. నూలివీడు శివారెడ్డి, ఫరీద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారందరికీ నియోజకవర్గ
టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.