AP:
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఆర్‌ఈసీఎస్ మాజీ డైరెక్టర్లు, వందలాది మంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు. సొంత నియోజకవర్గంలోనే కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడటం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.