AP: విజయవాడ నగరంలో గత రెండు రోజులుగా ‘సైలెంట్ పార్టీ’ పేరుతో వెలుస్తున్న పోస్టర్లు ప్రజల్లో ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తున్నాయి. సోషల్ మీడియాలో పంది ముఖం మాస్క్ ధరించిన వ్యక్తి ప్రొఫైల్ ఫోటోతో ప్రచారం సాగుతోంది. ఈ పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిధుల సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రాజకీయ నాయకుల శైలిని అనుకరిస్తూ విమర్శలు చేస్తున్న ఆడియోలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టత లేదు.