AP: రాష్ట్రవ్యాప్తంగా 39,888 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC)
ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే, పలు ప్రాంతాల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల విషయంలో పార్టీల మధ్య వివాదాలు చెలరేగడంతో 4,171 పాఠశాలల్లో
ఎన్నికలు వాయిదా పడ్డాయి. సామరస్యంగా జరగాల్సిన ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాయిదా పడిన చోట్ల అక్టోబర్ 1న
ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.