సర్పంచిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

23చూసినవారు
సర్పంచిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి
AP: విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం తానాం సర్పంచిగా పైలా మధుబాబు విజయం సాధించారు. ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో కొన్నేళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆయన.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసి 239 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మధుబాబు కుటుంబానికి గ్రామ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన తాత 22 ఏళ్లు, తండ్రి 20 ఏళ్లు సర్పంచులుగా పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్