ఆత్మకూరు - Atmakur

ఉమ్మడి వరంగల్ జిల్లా
దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. తెలంగాణ అటవీ శాఖ
Oct 17, 2026, 08:10 IST/

దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. తెలంగాణ అటవీ శాఖ

Oct 17, 2026, 08:10 IST
దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర పక్షి 'పాలపిట్ట' సంరక్షణపై అటవీ శాఖ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పండుగ సంప్రదాయం పేరుతో పాలపిట్టలను బంధించి ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా మండపాల్లో పక్షులను బంధిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అటవీ శాఖ తెలిపింది. మూగజీవాల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.