
శ్రీరామ్ నగర్ కాలనీలో అమ్మవారికి విశేష పూజలు.
కందుకూరులోని శ్రీరామ్ నగర్ కాలనీలో దసరా సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న లలిత త్రిపుర సుందరిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి కాలనీవాసులు భక్తి శ్రధ్ధలతో పూజలు నిర్వహించి ప్రసాదాలను పంచిపెట్టారు. ప్రతిరోజు అమ్మవారి కీర్తనలను, భజనలను నిర్వహిస్తూ ఆ ప్రాంతం అంతటా భక్తిపారవస్యంతో నిండిపోతుంది.






















