
స్థానిక ఎన్నికలపై అవగాహన కార్యక్రమం
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నందిపాడు, వెంకటంపేట, పాపంపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్సై బి. మహేంద్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవాంఛనీయ సంఘటనలకు దూరంగా ఉండాలని సూచించారు.


































