నెల్లూరు సిటీ - Nellore City

నెల్లూరులో కార్డన్ అండ్ సెర్చ్..15 వాహనాలు స్వాధీనం

నెల్లూరులో కార్డన్ అండ్ సెర్చ్..15 వాహనాలు స్వాధీనం

నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గురువారం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగుంట రాజేంద్ర నగర్‌లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పొదలకూరు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, కొత్త చట్టాలు మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రశాంతత కోసం పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

వీడియోలు


వికారాబాద్ జిల్లా
దుర్గామాత శోభాయాత్రలో యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
Oct 22, 2026, 17:10 IST/

దుర్గామాత శోభాయాత్రలో యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు

Oct 22, 2026, 17:10 IST
TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దుర్గామాత శోభాయాత్ర జరుగుతున్న సమయంలో దారుణం చోటుచేసుకుంది. శోభాయాత్రను చూసేందుకు వచ్చిన 19 ఏళ్ల యువతిని.. అదే కాలనీకి చెందిన సంతోశ్ (23) అనే యువకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలపడంతో, వెంటనే పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరిపి, గురువారం రిమాండ్‌కు తరలించారు.