
నరసారెడ్డి వారి కండ్రిగ వద్ద లారీ బోల్తా
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని నరసారెడ్డి వారి కండ్రిగ వద్ద ఆదివారం లిక్విడ్ లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో లారీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తీ కారణాలు ఇంకా తెలియరాలేదు.





























