
విషాదం.. ఆర్టీసీ బస్సు కిందపడి ఒకరు మృతి
పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిరదవోలు చెర్లోపల్లి గ్రామానికి చెందిన నాగేళ్ల ప్రభాకర్ నాయుడు (65) మృతి చెందారు. రోడ్డుపై ఎర్రగడ్డల బస్తాలు పడి వాహనాల రాకపోకలకు అవి నుజ్జునుజ్జయ్యాయి. ఈక్రమంలో అటు నుంచి ప్రభాకర్ నాయుడు స్కూటీపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

























