
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
అనంతపురం శివారు సిండికేట్ నగర్ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సదాశివ కాలనీకి చెందిన విక్కీ (20), వికాస్ (21) ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా సిండికేట్ నగర్ కు చెందిన మరో ఇద్దరు బైక్ పై అనంతపురం వైపు వస్తూ వీరిని ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






























