అనంతపురంలో విషాదం

2చూసినవారు
అనంతపురంలో విషాదం
ఉమ్మడి అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో ఒక బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. న్యామద్దలకు చెందిన 19 ఏళ్ల అమూల్య అనంతపురంలోని ఒక కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తనకు బాధలు తీరిపోవాలని తరచూ తన తల్లితో చెప్పేది. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన అమూల్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్