
ధర్మవరం ఎన్నికల బరిలో త్రివేణి విస్తృత ప్రచారం
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం జోరందుకుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి, 46, 16, 19వ వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతు కోరారు. బీజేపీ అభ్యర్థులకు కమలం గుర్తుపై, కూటమి చైర్మన్ అభ్యర్థి పరిశే సుధాకర్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భారీ మెజారిటీయే లక్ష్యంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు.

































