
రాష్ట్రస్థాయిక్రీడా పథకాల సాధించిన పెద్దవడుగూరు విద్యార్థులు
పెద్దవడుగూరు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పలు పథకాలు సాధించారు. ఆదివారం కాకినాడలో జరిగిన అండర్ 19 విభాగంలో చరణ్ ఓబుల్ రెడ్డి రజత పతకం, భువన చంద్రిక కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.



























