
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి సమీపంలోని నల్లచెరువు మండలం అలుగుండు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ తనకల్ మండలానికి చెందినవారని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తికి చికిత్స అందుతోంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





























