
రొళ్ల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా శ్రావణి
శ్రీసత్యసాయి జిల్లా, రొళ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బి. శ్రావణిని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. తన ఎంపికకు సహకరించిన మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజుకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామికి శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి తరపున ఏకగ్రీవంగా ఎంపిక కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


























