
చల్లాపల్లి టీడీపీ ఎంపీటీసీగా నరసింహామూర్తి ఖరారు
సోమందేపల్లి మండలం చల్లాపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా కదిరేపల్లి గ్రామానికి చెందిన ఎస్. నరసింహమూర్తిని టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు సోమవారం చల్లాపల్లి, కదిరేపల్లి, జూలకుంట, ఓబులదేవరపల్లి గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.




















