
వి. ఆర్. ఏ ల వినూత్న నిరసన
గత 24 రోజులుగా గోరంట్ల మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏలు) చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా విఆర్ఏలు శుక్రవారం ఒంటి కాలుపై నిలబడి దండం పెట్టి నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 24 రోజులు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. పే స్కేలు, అర్హులైన వారికి విఆర్ఓ ప్రమోషన్లు, నామినీలను రెగ్యులరైజేషన్ చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

























