
దుర్గాష్టమి సందర్భంగా చౌడేశ్వరి దేవికి గ్రామోత్సవం
సి కె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా స్థానిక చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ కి వివిధ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రామస్వామి గుడిలో అమ్మవారి కలశానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పురోహితుడు వేదమంత్రాలతో పూజ చేసి పూజారి తలపైన అమ్మవారిని ఎత్తుకొని గ్రామంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి స్తోత్రాలను పట్టిస్తూ ఉత్సవ విగ్రహాన్ని చౌడేశ్వరిదేవి ప్రధాన ఆలయానికి చేర్చారు. భక్తులు ఆలయంలో అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.






























