
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
పెద్దవడుగూరు మండలంలోని గుత్తి-అనంతపురం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయదుర్గం మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఆకాశ్ (23) అనే మినీ లారీ డ్రైవర్, హైదరాబాద్ నుంచి వస్తుండగా, గుత్తి-అనంతపురం సమీపంలో విరుపాక్షిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద లారీ టైరు పగిలిపోవడంతో వాహనం ఆపాడు. టైరును పరిశీలిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



























