తాడిపత్రి - Tadipatri

జాతీయ స్థాయి పోటీలలో అయాన్ తైక్వాండో అకాడమీ విద్యార్థి

జాతీయ స్థాయి పోటీలలో అయాన్ తైక్వాండో అకాడమీ విద్యార్థి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీలలో నిర్వహించిన జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో తాడిపత్రికి చెందిన అయాన్ తైక్వాండో అకాడమీ క్రీడాకారుడు M. రఘునాథ్ రెడ్డి కాంస్య పతకం (Bronze Medal) సాధించి ప్రతిభ చాటాడు. జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి పతకం సాధించడం తాడిపత్రి క్రీడా రంగానికి, అయాన్ తైక్వాండో అకాడమీకి గర్వకారణమని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో రఘునాథ్ రెడ్డి ఈ విజయాన్ని సాధించాడని పేర్కొన్నారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా