
కొత్త పెన్షన్లు.. దివ్యాంగులకు తప్పని ఇబ్బందులు
AP: కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియలో 85 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారి దరఖాస్తుల విషయంలో స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలని 'స్వర్ణ' సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో దివ్యాంగులను వెంటబెట్టుకొని తిరగడం కుటుంబసభ్యులకు భారంగా మారింది. 85 శాతం వైకల్యం ఉన్నవారికి ₹10,000, మంచానికి పరిమితమైనవారికి ₹15,000 పెన్షన్ అందించబడుతుంది.


































