
గేదెలవానిపేట మున్సిపల్ హైస్కూల్లో ప్రశాంతంగా SMC ఎన్నికలు
ఆముదాలవలసలోని గేదెలవానిపేట పీఎం శ్రీ మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం SMC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 206 మంది ఓటర్లకు గాను 197 మంది హాజరై 15 మందిని తల్లిదండ్రులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో సాధు అప్పలనాయుడు SMC చైర్మన్గా, బండారు పార్వతి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయులు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ నిర్ణయించింది.
































