Oct 04, 2026, 02:10 IST/
సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలి: రామ్
Oct 04, 2026, 02:10 IST
డీప్ ఫేక్ వీడియోల నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై నటుడు రామ్ స్పందించారు. ఆన్లైన్లో స్పష్టమైన గుర్తింపు లేకపోవడం వల్లే కొందరు భయం లేకుండా వ్యవహరిస్తున్నారని, కాబట్టి ప్రతి సోషల్ మీడియా ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, తద్వారా ఆన్లైన్ వేధింపులను అరికట్టవచ్చని రామ్ ట్వీట్ ద్వారా తెలిపారు.