Oct 13, 2026, 15:10 IST/
భారత్-వెస్టిండీస్ టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్
Oct 13, 2026, 15:10 IST
భారత్-వెస్టిండీస్ టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఉప్పల్లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లను గోషామహల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద 8 దాండియా పాసులు, రూ.5 వేల నగదు లభ్యమైంది.