Sep 26, 2026, 05:09 IST/
బాలుడిపై ట్రాన్స్జెండర్ లైంగిక దాడి
Sep 26, 2026, 05:09 IST
హైదరాబాద్లోని కాచిగూడలో నింబోలిఅడ్డాకు చెందిన జి. అవంతిక భార్గవ్ అలియాస్ శ్రావణ్కుమార్ (33) అనే ట్రాన్స్జెండర్ను 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు.