
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
సోంపేట మండలం పాలవలస గ్రామ పరిధిలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారి బలమైన గాలులు వీయడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. విద్యుత్ అంతరాయం కారణంగా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
























